సోమవారాల్లో పార్టీకి వెళ్తున్నారా? ఐతే తెల్లని దుస్తులు వాడండి!
, శనివారం, 8 ఫిబ్రవరి 2014 (15:01 IST)
మీ పుట్టినరోజు సోమవారాల్లో వస్తుందా..? లేదా మీ బంధువుల ఇంట్లో ఏదైనా ప్రత్యేక పార్టీలాంటిది సోమవారం ఉందనుకున్నప్పుడు... ఆ రోజు తెల్లని, లేత నీలిరంగు లేదా కొద్దిగా వెండిఛాయ కలిగిన దుస్తులు ధరించడం మంచిదని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. ఇలా చేస్తే.. ఆ ఫంక్షన్‌లలో ఎన్నడూ మిమ్మల్ని లెక్కచేయని వారు కూడా మీకు ఓ ప్రత్యేకతనిస్తూ మాట్లాడే అవకాశాలున్నాయని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది.ఇలా ఫంక్షన్లకే కాదు.. కాలేజీలకైనా .. మీ ఆఫీసులో అయినా క్రమంగా సోమవారాలు అలాంటి డ్రెస్సులే వేసుకుంటే నెమ్మదిగా మీకున్న ప్రతికూలతలు తప్పక తొలగిపోతాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం ద్వారా మీలో రెండింతల ఆత్మవిశ్వాసం చేకూరి, మీకే తెలియని ఉత్సాహంతో పనిచేయగలుగుతారని వారు చెబుతున్నారు.ఒకవేళ పూర్తి తెలుపు రంగు దుస్తులే మీ వద్ద లేని పక్షంలో... ఆ రంగుతో సరిపడే బార్డర్‌లు లేదా షేడ్స్, పువ్వులు, గీతలు ఇలా తెలుపు రంగుతో కలిసేటట్లుగా ఉండే దుస్తులను ఎంచుకోవచ్చునని ఫెంగ్‌షుయ్ శాస్త్రం పేర్కొంటోంది.