సముద్రపు ఉప్పుతో కూడిన బౌల్‌ను హాలులో ఉంచితే?
ఉప్పు స్వచ్ఛతకు చిహ్నం. ఈ ఉప్పును మన గృహంలోని ప్రతికూల శక్తులను పారద్రోలేందుకు ఉపయోగించవచ్చునని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. అదెలాగంటే.. ముఖ్యంగా సముద్రపు నీటితో తయారు చేసే ఉప్పును మీ హాలులో ఒక బౌల్‌లో నింపి ఉంచితే ఇంట్లోకి సానుకూల శక్తుల నివాసముంటాయని, అలాగే ప్రతికూల ఫలితాలు తొలగిపోతాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు చెబుతున్నారు. సముద్రపు ఉప్పు ఒక బౌల్‌లో నింపి లేదా ఆ ఉప్పును నీటిలో కలిపి ఓ బౌల్‌లోకి తీసుకుని ఈశాన్యం మరియు నైరుతి దిశాముఖంగా ఉంచితే సానుకూల ఫలితాలుంటాయి. ఇలా చేయడం ద్వారా మీ గృహం స్వచ్ఛతకు తావిచ్చినట్లు అవుతుంది. అలాగే ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి దూరమవుతుంది.ఓ గాజు గిన్నెలో సగం వరకు సాల్ట్‌ను నింపి హాలులో ఏదైనా టేబుల్‌పై ఉంచొచ్చు. అలాగాకుండా సగం భాగం బౌల్‌లో సాల్ట్‌ను సగం నీటిని కలిపి ఉంచవచ్చునని ఫెంగ్‌షుయ్ నిపుణులు చెబుతున్నారు.