నైరుతి దిక్కు ప్రేమకు అదృష్టమైన దిక్కు. నైరుతిలో దంపతుల ఫోటోను ఉంచినట్లయితే వారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది.
బెడ్రూమ్‌లో నైరుతి దిశలో లవ్ కపుల్, చుట్టూ అందమైన పూలచెట్లు ఉన్న డ్రీమ్ హౌస్ చిత్రం, జత గులాబీ పుష్పాలు దాంపత్య జీవితంలో ఉత్సాహాన్ని నింపడమే కాక పడక గదిలో దంపతుల మధ్య ఎటువంటి మనస్పర్థలు లేకుండా చూస్తాయని ఫెంగ్‌షుయ్ చెపుతోంది.
ప్రత్యేకంగా కొన్ని చిహ్నాలను బెడ్రూమ్‌లో ఉంచటం వల్ల శృంగార జీవితం సంతోషమయమవుతుందని చెపుతోంది ఫెంగ్‌షుయ్.
జత ప్రేమ పక్షుల చిత్రం సంతోషకరమైన వైవాహిక జీవితానికి అర్థం. రెండు పక్షులు జతగా ఉన్న చిత్రాన్ని బెడ్రూమ్‌లో ఉంచటం వల్ల ఎప్పటికీ దంపతులు ఒకటిగానే ఉంటారు తప్ప ఒంటరిగా ఉండరు.
దంపతులు తమ పడక గదిలో పింక్ కలర్ పూలను ఉంచినట్లయితే వారిలో శృంగార వాంఛ రెట్టింపవుతుంది. అలాగే పింక్ కలర్ వృక్షాల తాలూకు చిత్రాలను ఉంచినట్లయితే సంసారంలో ఎటువంటి సమస్యలు తలెత్తవని ఫెంగ్‌షుయ్ చెపుతోంది.
ఈ దిక్కున అమర్చిన పింక్ పూలు దంపతులలో కోరికను రేపి ఒక్కటి చేస్తాయి. అలాగే డోర్, విండో కర్టెన్స్ రంగు రంగుల పూలతో కూడినవాటినే వాడితే మంచిది. ముదురు రంగు కర్టెన్లను వాడకపోవడమే బెటర్.