మీ పర్సనల్ లేదా బిజినెస్ విజిటింగ్ కార్డుని తయారు చేయించుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ సంపద, బిజినెస్ రెట్టింపు అవుతుందని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది. కాబట్టి మీ విజిటింగ్ కార్డును తయారు చేసేటప్పుడు ఈ కింది జాగ్రత్తలను పాటిస్తే సంపదను అభివృద్ధి చేసుకోవచ్చని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది.
మీ కార్డు మీద చిహ్నం లోగో ఎప్పుడూ చివరన తేలేటట్లుగా ఉండకూడదని, అది విషపు చిహ్నాలను చిందిస్తుందని ఫెంగ్ షుయ్ తెలుపుతోంది. కార్డుమీద విషయం ఎప్పుడూ లోగో మీదకు వచ్చేటట్లుగా డిజైన్ చేయకూడదని, గుండ్రని లేదా దీర్ఘచతురస్రాకారపు ఆకారాలను ఎన్నుకోవడం మంచిదని ఫెంగ్‌షుయ్ పేర్కొంటుంది.
మీ కార్డు సైజుకు ఒక వైపున్న 5 సెం.మీటర్లకు మించకూడదని, రెండు మూడు రంగులను వాడినా అవి ఒకదానికొకటి సరితూగుతున్నట్లు ఉండాలని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది. మంచిరంగులు కలవి పసుపుపచ్చ- నలుపు, బ్రౌన్- నలుపు, నీలం- నలుపు తదితర రంగులు మంచివని ఫెంగ్‌షుయ్ అంటోంది.