లవర్స్‌కు లాఫింగ్ బుద్ధ కానుకగా ఇస్తే ఏం జరుగుతుంది?
మనం ప్రేమించే వారికి మంచి బహుమతి ఇవ్వాలనుకుంటే లాఫింగ్ బుద్ధను కొనిస్తే వారి ప్రేమ జీవితాంతం చిరస్థాయిగా నిలిచిపోతోందని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. పెద్ద పొట్టతో హాయిగా నవ్వుతూ ఉండే బుద్ధుడు.. కుండలు పట్టుకుని లేదా వెనుకాల గోతం వేసుకుని ఉన్నట్టుగా లాఫింగ్ బుద్ధా బొమ్మలుంటాయి. ఇవన్నీ సంపదతో నిండి ఉంటాయని విశ్వాసం. అనంతమైన ఆనందం, ఓర్పు, దయ కలిగిన వాడే బుద్ధుడు. అన్ని కష్టాలను, సమస్యలను ఓర్చి వాటిని ఆనందంగా రూపాంతరం చెందిస్తాడని నమ్మకం. పిల్లలు, పేదలు, బలహీనుల పక్షాన ఉంటాడని కూడా భావిస్తారు. ఈ విగ్రహాలు లోహం, టెర్రకోట, క్రిస్టల్స్ వంటివాటితో తయారు చేస్తారు. ఇవి రకరకాల ఫోజులలో కూడా ఉంటాయి. పూ తాయ్‌గా పిలుచుకునే ఈ బుద్ధుడు వెయ్యి సంవత్సరాల క్రితం చైనాలో జీవించాడని ఒక నమ్మకం.అదృష్టం, సంపద కలిగేందుకు ఫెంగ్‌షూయ్ నిపుణులు ఈ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోమని సూచిస్తుంటారు. ఈ బొమ్మ ప్రతికూల ప్రాణ శక్తిని హరించి సానుకూల శక్తి ప్రవహించేలా చేస్తుందని నమ్మకం.