చాలామందికి రాత్రిళ్లో అంత సులభంగా నిద్రపట్టదు. అలాంటి వారు కొన్ని సూత్రాలను పాటిస్తే చక్కగా నిద్ర పడుతుందని ఫెంగ్‌షుయ్ పేర్కొంటోంది. ముందుగా మీరు నిద్రపోయే మంచం గోడకు అనుకుని ఉండాలని, గోడ నుండి ఒక అడుగు దూరం స్థలాన్ని వదిలేసి మంచాన్ని వేసుకోవాలని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది.
బెడ్‌ని ప్రతిఫలించే విధంగా మీ బెడ్‌రూమ్‌లో అద్దం ఉండకూడదని ఫెంగ్‌షుయ్ అంటోంది. అంతేకాక కొంతమంది గాలి బాగా వస్తుందని మంచాన్ని కిటకీ దగ్గరకు వేసుకోవడం చేస్తారు. కానీ ఫెంగ్‌షుయ్ సూత్రాల ప్రకారం అలా వేసుకోవడం మంచిది కాదని,. పడక మంచం తలుపుకు, కిటికీలకు దూరంగా ఉండాలని ఫెంగ్‌షుయ్ వెల్లడిస్తోంది.
పడగ గదిలో నెమ్మదిగా విన్పించే సంగీతం ఉంటే నిద్ర బాగా పడుతుందని, సముద్రపు అలల శబ్దమో, సెలయేరు శబ్దమో, నీళ్ళు పైనుండి కిందకు పడుతున్న శబ్దమో వింటే అలసిన మనస్సు నిద్రలోకి జారుకుంటుందని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది.
సౌకర్యాన్ని బట్టి మీ బెడ్‌రూమ్‌కు దగ్గర ఒక విండ్ చిమ్‌ని పెట్టుకోండని, లేకపోతే నైరుతిమూలలో ఒక క్రిస్టల్‌ను వేలాడదీయండని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది. బెడ్ రూమ్‌లో పచ్చరంగు, పసుపు రంగులలో ఉన్న బల్పును వాడుకున్నట్లయితే నిద్రబాగా పడుతుందని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది.