గృహ నిర్మాణంలో మెట్లు ప్రత్యేక అందాన్ని చేకూరుస్తాయన్న విషయం తెలిసిందే. ఏ ఇంటి ముందైనా కేవలం మూడు మెట్లు లేదా అంతస్తులైతే అధికమైన మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. అయితే ఈ మెట్ల అమరికలోనూ శుభ ఫలితాలు చేకూరుతాయని ఫెంగ్ షుయ్ పేర్కొంటుంది. దీని సూత్రాల ప్రకారం మెట్లను అందంగా మార్చుకుంటే అదృష్టం వరదలా మనల్ని వరిస్తుంది.
మీ ఇంటి మెట్లను, పార్కింగ్ స్థలాన్ని ఎప్పుడూ బాగా వెలుతురు ఉండేటట్లుగా నిర్మించుకోవాలి. ఒకవేళ మెట్లమీదకు సహజ వెలుతురు సరిగా రానట్లయితే ఒక విద్యుత్ బల్బుని ఉంచి వెలుతురు ప్రసరింపచేసుకోవచ్చు. మీ మెట్ల పరిధి చిన్నదిగా ఉంటే ఒక పెద్ద అద్దం ఉంచడం శ్రేయస్కరం.
వాటిద్వారా సమస్యని అధిగమించవచ్చు. మీ ఇంటి మెట్లమధ్య ఖాళీ ఉంటే మంచిది కాదు. అందువల్ల వాటి స్థానంలో చెక్కముక్కలాంటివి ఉంచి ఖాశీ స్థలాన్ని నింపేయండి. అలాగే మీ మెట్లు చివర ( మొదటి ద్వారం దగ్గరలో) ఏదైనా పెయింటింగ్ లాంటివి ఉన్నట్లయితే, మంచిశక్తికి నిదర్శనంగా పనిచేస్తుంది.