ముగ్గురు వ్యక్తులు కలుసుకున్న ఫోటోలను తగిలించకండి
, మంగళవారం, 18 అక్టోబరు 2011 (17:27 IST)
మనలో చాలా మంది గ్రూప్ ఫోటోలు దిగుతారు. అయితే చైనీష్ వాస్తు ప్రకారం ముగ్గురు వ్యక్తులు వరసగా నిలబడున్న ఫోటోలు మంచివి కావు. అయితే ఈ నిబంధన కుటుంబ సభ్యులున్న ఫోటోలకు వర్తించదు. అలా ఫోటోల్లో ముగ్గురు వ్యక్తులు వుంటే అది సంఘర్షణకు దారితీస్తుందని చైనీయుల నమ్మకం.అందుకే చైనాలో చాలా మంది ఆర్టిస్టులు అలా ముగ్గురు వ్యక్తులున్న ఫోటోలు, పెయింటింగ్‌లను వేయడానికి సాహసించరు. ఎందుకంటే ముగ్గురు వ్యక్తులు వున్న ఫోటోలోని మధ్య వ్యక్తి ఎప్పటికైన విడిపోతారని నమ్మకం. అందుకే ముగ్గురు స్నేహితులు కలిసి ఫోటో దిగకపోవడమే మంచిది.అయితే ఈ నిబంధన కుటుంబ వ్యక్తులకు వర్తించకపోయినప్పటికీ, వారు సైతం ఫెంగ్‌షూయ్ ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అదేమిటంటే - ముగ్గురు కుటుంబ సభ్యులు వరసగా కాకుండా, మధ్యవ్యక్తి కొద్దిగా వెనకగా నిలబడి ఫోటో తీసుకుంటే ఎలాంటి కీడు వుండదని నమ్ముతారు.