మీరు ముగ్గురు స్నేహితులా..? ఐతే ఇలా చేయకండి
స్నేహిలంటూ లేని వ్యక్తులు ఈ సమాజంలో ఉండరనే చెప్పాలి. స్నేహానికి ప్రాధాన్యతనిచ్చే ఎంతో మంది మనకు ప్రతిరోజూ కనిపిస్తూనే ఉంటారు. ఇంకా మనలోనే ఓ మంచి స్నేహితుడు/ స్నేహితురాలు ప్రతిబింబిస్తూనే ఉంటాడు. కుటుంబ సభ్యులతో పంచుకోలేని ఎన్నో భావాలను స్నేహితులతో చెప్పుకుంటూ మనుగడను కొనసాగించేవారు ఎంతో మంది మనచుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఇలా సుఖదుఃఖాల్లో పాలుపంచుకుంటూ ఆదరణగా నిలిచే స్నేహబంధాన్ని కాపాడుకునేందుకు ఫెంగ్‌షుయ్ కొన్ని సలహాలను చెబుతోంది. సాధారణంగా కొందరికి చాలా మంది స్నేహితులుంటారు. మరికొందరికైతే ముగ్గురు, నలుగురు లేదా ఐదుగురు స్నేహితులను కలిగి ఉంటారు. వీరిలో మీరు ముగ్గురు స్నేహితులైతే, ఫోటోలకు దిగేటప్పుడు వరుసగా నిలబడి తీయించుకోవడం మంచిది కాదని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. అంతేగాకుండా ముగ్గురు స్నేహితులు వరుసగా నిలబడి ఫోటో తీయించుకున్నట్లైతే వారి స్నేహబంధం విడిపోతుందని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది. అయితే ముగ్గురు స్నేహితులు వరుసగా గాకుండా, మధ్యవ్యక్తి కొద్దిగా వెనకగా నిలబడి ఫోటో తీసుకుంటే ఎలాంటి కీడు ఉండదని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా ముగ్గురు స్నేహితులు వరుసగా నిలబడి ఫోటో తీసుకుంటే మధ్యలో నిలబడే వ్యక్తి ఎప్పటికైనా విడిపోతారని వారు చెబుతున్నారు. అందుకే ముగ్గురు స్నేహితులు కలిసి వరుసగా ఫోటోకు దిగకపోవడమే మంచిదని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. ఈ నియమం కుటుంబ సభ్యులకు కూడా వర్తించదని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. అయితే ముగ్గురు స్నేహితులు వరుసగా ఫోటోకు దిగితే అది సంఘర్షణకు దారితీస్తుందని వారు సూచిస్తున్నారు.