సాధారణంగా ఇంట్లోనో, ఆఫీసులోనో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సభ్యులు హాజరవుతుంటారు. అలా మీటింగ్ ఏర్పాటు చేసేముందు ఏ వ్యక్తికి ఏ స్థానంలో సీటును ఏర్పాటుచేయాలో సూచిస్తే ఆ మీటింగ్ విజయవంతం అయ్యే అవకాశాలు ఉంటాయి. సాధారణంగా మీటింగ్‌లో గుండ్రని టేబుళ్ళను వినియోగించినట్లైతే మీటింగ్ ఫలితాలు మంచిదిగా ఉంటాయని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది.
లేకుంటే దీర్ఘచతురస్త్రకారపు టేబుళ్ళను వాడుకోవడం మంచిదని పెంగ్‌షుయ్ వెల్లడిస్తోంది. సీటును ఏర్పాటుచేసేటప్పుడు ఏ సభ్యుడి సీటూ విషపు బాణాలుగాని, టాయిలెట్ తలుపుగాని, పైన దూలంగాని గోడల చివర్లు వారికేసే ప్రసరించకుండా ఉండేటట్లు జాగ్రత్త పడాలని ఫెంగ్‌షుయ్ హెచ్చరిస్తోంది. పై జాగ్రత్తలన్నీ తీసుకుంటే ఆ మీటింగ్ విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఫెంగ్‌షుయ్ పేర్కొంటోంది.