మీకేమైనా మానసిక సమస్యలున్నాయా? ఫెంగ్‌షుయ్ టిప్స్..!
మీకేమైనా మానసిక సమస్యలున్నా, ధ్యానంలో నిమగ్నత కుదరకున్నా రోజూ పడుకునే ముందు ఒక పళ్ళెంలో కొన్ని బియ్యం ఉంచి, చక్కటి గంధపు సువాసన వేసే అగరుబత్తి ముట్టించి బెడ్‌రూమ్‌లో లేదా పూజగదిలో ఓ 21 రోజులు ఉంచండి. తప్పక మార్పు రాగలదు. అలాగే మీరు వ్యాపారం చేస్తున్నారా. మీ షాపు బస్టాపుకు మరీ దగ్గరగా ఉందా..? లేదా ఒక సందులో మీది చివరి షాపా? అయితే ఈ కౌంటర్ (బజార్ వైపు) అద్దంపై ఆకుపచ్చ దృశ్యం ఉన్న కాగితాన్ని (ఒక రెండు, మూడు అడుగుల కొలతకన్నా మించకూడదు) అతికించండి.అలాగే మీ ఇంటి దక్షిణం వైపు వాటాను అద్దెకు ఇవ్వకండి. అలాగే నైరుతి దిశవైపు గది లేదా వాటా ఎక్కువ మట్టుకు అద్దెకు ఇవ్వకండని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. ఇంకా మీరు ఒబిసిటీతో బాధపడుతుంటే.. ఫెంగ్‌షుయ్ ప్రకారం.. ఎక్కువమట్టుకు ఎనిమిది లేదా ఐదు అంచులున్న గాజు గ్లాసుతో విరివిగా నీళ్ళు తాగండి. లేదా కనీసం స్తూపం లేదా సిలిండర్‌లా ఉండే గాజు గ్లాసయినా పర్వాలేదు. ఇలా నమ్మకంతో చేస్తే ఒబిసిటీ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.