మీకు రాత్రిపూట నిద్రపట్టడం లేదా..!?
మానసిక ఆందోళనలతో చాలామందికి రాత్రిళ్లు వెంటనే నిద్రపట్టదు. అలాంటి వారు కొన్ని ఫెంగ్‌షుయ్ పరిష్కారాలను పాటిస్తే చక్కగా నిద్ర పడుతుంది. ముందుగా మీరు పడుకునే మంచం గోడకు ఆనుకుని (సపోర్ట్‌గా) ఉండాలి. గోడనుండి ఒక అడుగు దూరం స్థలాన్ని వదిలేసి మంచాన్ని వేసుకోండి. అలాగే మీ బెడ్‌ని ప్రతిఫలించే విధంగా ఏ రకమైన అద్దం బెడ్‌రూమ్‌లో ఉండకూడదు. అంతేకాక చాలామంది గాలి బాగా వస్తుందని మంచాన్ని కిటికి, ద్వారం దగ్గర లేదా క్రిందగా ఏర్పాటు చేసుకుంటారు. కాని ఫెంగ్‌షుయ్ ప్రకారం అది తప్పు. మీ మంచం కిటికీలకు, తలుపులకు దూరంగా ఉండాలి. అలాగే ఫెంగ్‌షూయ్ సూత్రాల ప్రకారం.. మంద్రంగా వినిపించే సంగీతం వింటే బాగుంటుంది. సముద్రపు అలల శబ్దమో, సెలయేరు శబ్ధమో, నీళ్ళపై నుండి కిందకు పడుతున్న శబ్ధమో వుంటే అలసిన మనసు మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. అలాగే వీలును బట్టి మీ పడకగదికి దగ్గర ఒక విండ్‌చిమ్‌ని పెట్టుకోండి. లేదా నైరుతి మూలలో ఒక క్రిస్టల్‌ను వేలాడదీయండి. బెడ్‌రూమ్‌లో ఎరుపు రంగు బెడ్‌లైట్ లేదా పసుపు పచ్చ, ఆకుపచ్చ రంగు బల్బును వాడటం మంచిదని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు.