మీ ఇంట్లో మెట్లకు ఎదురుగా బెడ్‌రూమ్ ఉందా..?!
మీ గృహంలో మెట్లకింద ఆక్వేరియం, ఫౌంటైన్‌లు ఉన్నాయా..? అయితే వాటిని వెంటనే తొలగించేయండని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు. మెట్ల కింద ఆక్వేరియం లేదా ఫౌంటైన్‌లు ఉంటే మీ పిల్లలు అనారోగ్యానికి గురవుతారని ఫెంగ్‌షుయ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.అలాగే మెట్ల కింద సామానులు, స్టోర్‌రూమ్‌లు, బాత్‌రూమ్‌లు, లెట్రిన్‌లు ఇలాంటివి ఉండకూడదు. సాధ్యమైనంతవరకు తప్పనిసరిగా మెట్ల పక్కన రెయిలింగ్ లేదా నడిచేందుకు ఆధారంగా ఉండే గోడలాంటిది కట్టాలి. ఇంకా మెట్లకు ఎదురుగా బెడ్‌రూమ్ ఉండరాదు. ఇంటికి ప్రధాన ద్వారం ఎదురుగా, లేదా హాలులో ప్రవేశించగానే మెట్లు ఉండకూడదు. ఇలా ఉండటం వల్ల చీ శక్తి ఇంటిలోనికి ప్రవేశించిన వెనువెంటనే హాలులో తిరగకుండానే, ఎదురుగా ఉన్న మెట్లపైకి పోతుంది. దీనివల్ల హాలులోనే కాక మిగతా అన్ని గదులలో కూడా సరిపోయేంత చీ శక్తి లభ్యం కాదు. ఇలా జరగడం ఆ ఇంట్లో నివసిస్తున్న వారికి అన్ని విధాలా మంచిది కాదు. ఇకపోతే.. ఇంటి మధ్య భాగంలో మెట్లుండరాదు. దీనివల్ల కుటుంబ కలహాలు రావచ్చు. ఉత్తరం లేదా వాయువ్య దశలలో మెట్లుంటే దురదృష్టం వెంటాడుతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు.