మీ ఇంట్లో.. డ్రెస్సింగ్ టేబుల్ ఎలా ఉంది?
ఫెంగ్‌షుయ్ ప్రకారం డ్రెస్సింగ్ టేబుల్‌ను ఏర్పాటు చేసుకుంటే శుభ ఫలితాలుంటాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. ముందుగా మీ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర వెలుతురు పడేలా ఉండాలి. అంటే అక్కడ లైట్లు ప్రకాశవంతంగా వెలుగుతూ ఉండాలి. ఇలా డ్రెస్సింగ్ టేబుల్ వద్ద వెలుగు వెదజిమ్మితే ఇంటి యజమానులకు వ్యాపారంలో అభివృద్ధి ఉంటుందని, ఆరోగ్యపరమైన సమస్యలు దరి చేరవని ఫెంగ్‌షుయ్ నిపుణులు చెబుతున్నారు.అయితే మీ డ్రెస్సింగ్ టేబుల్ అద్దం.. ఎప్పుడూ మీరు పడుకునే మంచానికి ఎదురుగా కన్పించకుండా జాగ్రత్తలు తీసుకోండి. మంచానికి ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్ ఉంటే.. అదిమీరు నిద్రపోతున్నప్పుడు చెడు "చీ" శక్తిని సృష్టిస్తుంది. ఒకవేళ మీ అద్దం కనుక అలా మీ మంచానికి ఎదురుగా ఉంటే దానిని అక్కడ నుంచి మార్చేయండి. మంచాన్ని మార్చలేని పక్షంలో ఓ వస్త్రంతో డ్రెస్సింగ్ టేబుల్ అద్దాన్ని కప్పివేయడం మంచిదని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.