మీ ఇంటి దక్షిణం వైపు ఎరుపురంగు ఫోటోలు వుంచితే..!
, శుక్రవారం, 25 ఏప్రియల్ 2014 (15:40 IST)
ఇంటి యజమాని ఫోటో ఎప్పుడూ రెడ్‌ఫ్రెమ్‌లో ఉంచి దక్షిణం వైపు ఉంచితే ఆ ఇంటి యజమానికి పేరు, ప్రతిష్టలు పెరుగుతాయట. అలాగే సంఘంలో మంచి పలుకుబడి, గుర్తింపు లభింస్తుదట. మీ ఇంటి దక్షిణం వైపు ఎరుపురంగు ఫోటోలు వుంచితే మీ పేరు ప్రతిష్టలు పెరగడంతో పాటు, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అయితే దక్షిణం వైపు బ్లూ రంగు ఫోటోలు మాత్రం ఉంచరాదని ఫెంగ్ షుయ్ నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే అగ్ని (దక్షిణం)కి నీటి (నీలరంగు)కి నిరంతరం సంఘర్షణ ఉంటూనే ఉంటుంది. ఫోనిక్స్ చిత్రాన్ని దక్షిణం వైపు ఉంచడం వల్ల అవకాశాలు వెల్లువలా వస్తాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. ఇంకా మీ ఇంట్లో పడమర ప్రాంతం ఎప్పుడూ పిల్లలు-సృజనాత్మకత అంశానికి సంబంధించిన ఫోటోలు తగిలించడం మంచిది. పడమర వైపు గోడమీద పిల్లల ఫోటోలు వుంచితే వారి అదృష్టాన్ని, శక్తిని పెంపొందించిన వారవుతారు. ఇంకా మీ ఇంట్లో రకరకాల ఫోటోలను ఫెంగ్‌షుయ్ తెలిపిన దిక్కుల్లో ఉంచడం వల్ల అనేక ప్రయోజనాలవు పొందవచ్చు. మీ ఆఫీస్ బాస్ లేదా మీకు సహాయం చేసే వారి ఫోటోలు ఎప్పుడూ నైరుతి వైపు ఉంచితే వారి సహాయ సహకారాలు మీకు ఎప్పుడు అందుతూనే ఉంటాయి. ఆగ్నేయం ఎప్పుడూ సంపదకు ప్రతీక కాబట్టి ఈ దిక్కున పచ్చికబయళ్ళతో ఉన్న చిత్రాలను ఉంచడం వల్ల సంపద పెరుగుతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు.