Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మనిషి జీవితంలో అదృష్ట వస్తువుల ప్రాధాన్యం

Advertiesment
ఆధ్యాత్మికం భవిష్యవాణి ఫెంగ్‌షుయ్ మనిషి అదృష్టం మనిషి  రాత మనిషి జీవితం అదృష్ట వస్తువుల ప్రాధాన్యం
, గురువారం, 28 ఆగస్టు 2008 (19:09 IST)
PTI
మనిషి పుట్టినపుడే అదృష్టం అనేది మనిషి నుదుటిపై రాయబడి ఉంటుంది. ఈ రాతను తప్పించడం ఎవ్వరి వల్ల కాదు. అయితే.. అదృష్టమనేది మన వెన్నంటి ఉంటే.. విధిరాతను కొంతమేరకు తప్పించుకోవచ్చని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చేపుతోంది. పంచ పదార్థాల పునరుత్పత్తి చక్రంలాగే పంచ శక్తులు మన జీవిత గమనాన్ని శాసిస్తుంటాయని ఫెంగ్‌షుయ్ చెపుతోంది. విధిరాత, అదృష్టం, దయాగుణం, విజ్ఞానం, ఫెంగ్‌షుయ్ అనే ఈ ఐదు మనిషిని నడిపించే ప్రకృతి శక్తులుగా పేర్కొనవచ్చు.

ఫెంగ్‌షుయ్‌లో పేర్కొన్న కొన్ని అంశాలను మాత్రం కొంత మేరకైనా పాటిస్తే మనం ప్రకృతి శక్తుల సమతుల్య స్థితి ద్వారా అదృష్టాన్ని సొంతం చేసుకుని, అభివృద్ధి పథంలో పయనించగలుగుతాము. ఇందుకోసం మనం నివశించే ఇళ్లు, మన అభివృద్ధికి దోహదపడే ఆఫీసుల్లో ఎంలాంటి మార్పులు చేర్పులు చేసుకోవాలో తెలియజేస్తోంది. ఆ మార్పులతో పాటు కొన్ని అదృష్ట వస్తువులు మీ ఇంట్లో ఉంచుకున్నట్టయితే మీరు మరింత మేలు జరుగుతుందని ఫెంగ్‌షుయ్ చెపుతోంది.

గృహాల్లో, ఆఫీసుల్లో ఉంచుకోదగిన అదృష్ట వస్తువుల్లో లాఫింగ్ బుద్ధ, డ్రాగన్, ఫోనిక్స్, మూడుకాళ్ల కప్ప, విండ్ చిమ్స్, ఫెంగ్‌షుయ్ నాణేలు, ఫక్, లక్, సా దేవతలు వంటి వస్తువులు ఉంచుకున్నట్టయితే.. కొంత మేరకు అదృష్టం మీ వెంటే ఉంచుకున్న వారవుతారని ఫెంగ్‌షుయ్ చెపుతోంది. చైనా నాణేలను తలుపులకు వేలాడదీస్తే సంపద ఇంట్లోనే ప్రవహిస్తుందని చైనీయుల నమ్మకం. మూడు చైనా నాణేలను ఎర్రటి రిబ్బిన్‌తో కట్టి ఇంటి తలుపుకు వేలాడ దీస్తే మీకు మరెన్నో ధన సంచులు సమకూరుతాయని నమ్మకం.

అలాగే.. నవ్వుతూ ఉండే బుద్ధుడి ప్రతిమను ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉంచినట్టయితే మీకు ధన సంపదలు సమకూరుతాయని, వియజం తప్పకుండా ప్రాప్తిస్తుందని ఫెంగ్‌షుయ్ చెపుతోంది. సంపదలనిచ్చే దేవునిగా ఖ్యాతి గడించిన బుద్ధుడు.. ఆయన ఆశీసుల వల్ల మనకు మరింత అపరిమిత శక్తి సంపదలను సమకూరుస్తాయని నమ్మకం. చైనీయుల అతి పవిత్రమైన జంతువు డ్రాగన్. దీన్నిఇంటిలో ముఖ్యంగా పడక గదిలో ఉంచుకున్నట్టయితే ఉత్సాహంగా ఉంటారని చైనీయుల నమ్మకం.

Share this Story:

Follow Webdunia telugu