ఫెంగ్‌షూయ్ ఇంటి నిర్మాణ విధానాన్ని బట్టి కొన్ని సూత్రాలు, నియమాలు పేర్కొన్న విషయం తెలిసిందే. అదే శాస్త్రం కొన్ని సాధారణ పరిష్కారాలను కూడా వెల్లడిస్తోంది. అందులో కొన్నింటిన పరిశీలిద్దామా... ఇంటి ప్రధాన ద్వారం దగ్గరగా లివింగ్ రూమ్ లేదా డ్రాయింగ్ రూమ్‌ను ఏర్పరచుకోవాలి.
అతిథులు ఆ గదిలో కూర్చుంటే వారికి ప్రధాన ద్వారం నేరుగా కనిపించేటట్లు ఉండాలి. అలాగే ఆ గదిలో గుండ్రని టేబుల్, కుర్చీ లేదా ఫర్నిచర్‌లను ఎక్కువగా వేయకండి. వీలుని బట్టి ఏదైనా ఓ గోడకు మధ్యగా రెండు అడుగులున్న మామూలు అద్దాన్ని ఉంచండని ఫెంగ్‌షూయ్ చెబుతోంది. వీటన్నింటి వల్ల అతిథులకు మీ పట్ల మంచి అభిప్రాయం పెరిగి, మీకు లాభం చేయగల కోణంలో ఫలితాలుంటాయి.
ఇంటిలో ఎక్కడైనా పొడుచుకువచ్చిన తీరులో ఉంటే అక్కడ ఏదేని ఫర్నిచర్ లేదా మూలగా ఉంటే అక్కడ మొక్క లేదా శిల్పం పెట్టండి. అలాకాకుంటే క్రిస్‌మిస్ ట్రీ లాంటిది లేదా వినాయక చవితి పండుగల్లో అలంకరించే ఒక స్టాండుకున్న త్రికోణాకారపు చెట్టులాంటి మార్కెట్ నుంచి పట్టుకొచ్చి, దానికి రంగు రంగుల చిన్న బల్బులు కూడా ఉండేటట్లు అమర్చుకోండి.
ఇంకా అనేక సూత్రాలను ఫెంగ్‌షూయ్ పేర్కొంది. అందులో మరికొన్ని నియమాలు తదుపరి కథనంలో చూద్దామా...