రంగులనేవి మనస్సుని వైబ్రేషన్‌లకు గురిచేస్తాయి. రకరకాల రంగులను మనం సైతం వాడటం వల్ల అదృష్టం మనల్ని వరిస్తుందని ఫెంగ్‌షూయ్ శాస్త్ర నిపుణులు అంటున్నారు.
ఇందులో అదృష్టాన్నిచ్చే రంగులను గురించి పరిశీలిస్తే...
తెలుపు... తెలుపు రంగును గృహములోని దూలాలకు, పైకప్పులకు వాడవచ్చును. పైగా తెలుపురంగు అభివృద్ధికి చిహ్నం.
నీలం... నీటికి ప్రతిరూపం రంగయిన ఈ బ్లూ రంగుని ఉత్తరం వైపు, ఈశాన్యంలో ఉంచడం వల్ల మనకు మంచి ఫలితాలు కలుగుతుంది.
ఆకుపచ్చ... ఇది ఆగ్నేయానికి చిహ్నం, సంపదకు ప్రతిరూపం. ఈ రంగు తూర్పువైపు కూడా మంచిని కలిగిస్తుంది. అందువల్ల రంగురంగుల పూల మొక్కల కుండీలను ఆయా ప్రాంతాల్లో ఉంచటం వల్ల మన సంపదని పెంపొందించుకోవచ్చు.
నలుపు... నలుపుకూడా నీటికి చిహ్నమే. దీనిని ఎక్కువగా వాడకూడదు. ముఖ్యంగా ఇంటిపై కప్పల మీద, దూలాలకు పొరపాటున వాడకూడదు.
ఎరుపు.... దక్షిణానికి చిహ్నం. రాబడికి ప్రతిరూపం ఇది. అందువల్ల దక్షిణం పైపు ఎరుపురంగు పోస్టర్లు, కర్టెన్‌లు, కార్పెట్‌లు ఉంచితే లాభదాయంగా ఉంటుంది. గృహంలో తెలుపురంగు పడమరవైపు వేయాలి. ఎందుకంటే వాయువ్యం, పడమర లోహస్థానం.