Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫెంగ్‌షుయ్ వాస్తు శాస్త్రంలో గృహాలపై రంగుల ప్రభావం!!

ఫెంగ్‌షుయ్ వాస్తు శాస్త్రంలో గృహాలపై రంగుల ప్రభావం!!
, సోమవారం, 17 మార్చి 2014 (12:39 IST)
File
FILE
భారతీయులు అధికంగా నమ్మే వాస్తు శాస్త్రాల్లో పెంగ్‌షుయీ ఒకటి. దీని ఆచరించటం ద్వారా జీవన గమనంలో ఆనందమయమైన మార్పులు సంభవిస్తాయని పండితులు అంటున్నారు. తదనుగుణంగానే ఈ శాస్త్రం భారతీయులకు నిత్యజీవన సూత్రంగా మారింది. ఈ శాస్త్రం ప్రకారం గృహాలు, ఆస్తులు, వస్తువులు, జీవనం ఎలా సాగించాలో వివిద రీతుల్లో వర్ణించటం జరిగింది. అందులో ప్రదానంగా మానవుడి జీవితంలో రంగుల ప్రభావం ఎలావుంటుంది. పెంగ్‌షుయీ శాస్త్రం ప్రకారం గృహాలకు ఎటువంటి రంగులను ఉపయోగిస్తే ఆరోగ్యవంతమైన జీవనం దొరుకుతుందనే విషయాన్ని విశదీకరించటం జరిగింది.

మనుషుల ప్రవర్తన, ఆలోచన, భావోద్వేగాలపై రంగుల ప్రభావం అధికంగా ఉంటుందని పెంగ్‌షుయీ వివరిస్తుంది. ఈ శాస్త్ర ప్రకారం ఏయే రంగుల ప్రభావం ఎలా ఉంటుదనే వివరాల్లోకి వెళితే.. అన్ని రంగుల్లోకెళ్లా కొట్టొచ్చేలా కనిపించేది ఎరుపు. దీనిని గృహాలకు మితంగా వాడితే మంచిది. పడక గదులకు పూర్తిగా ఉపయోగించకూడదు.

ఇక పసుపు రంగును మేధస్సుకు, పరిణతికి చిహ్నంగా కొలుస్తారు. ఈ రంగును వంటగది, సిటింగ్ రూమ్‌లకు వాడితే బాగుంటుంది. గోధుమ రంగు విషయానికి వస్తే ఇది స్థిరత్వమున్నది కాబట్టి ప్లోరింగ్‌కే పరిమితం చేయాలి. బంగారు, వెండి రంగులు ఇవి రెండూ ధనం, సంపధను సూచించే రంగులు. అందువల్ల దేవుడి గది. అధికంగా సంచారంలేని విశాల గదులకు వేయవచ్చు.

బూడిద, తెలుపు రంగులు ఎక్కడైతే దృష్టి కేంద్రీకరణం అవసరమో అక్కడ ఈ రంగులు వాడుకోవచ్చు. నీలం, వంకాయ రంగులు ఇవి విశ్రాంతికి సూచికలు. అందువల్ల బెడ్‌రూమ్, ఇతర విశ్రాంతి మందిరాల్లో కనిపించేలా వాడుకోవాలి. ఆకుపచ్చ రంగు వృద్దికి చిహ్నం. దీనిని బయటి గోడలకు వేయవచ్చు. గులాబీరంగు సిటింగ్ రూమ్‌లకు వేస్తే బాగుంటాయి. నలుపు రంగు జీవితంపై తీవ్ర ప్రభావం చూపే రంగు. అందువల్ల దీనిని ఎవ్వరు సంచరించని ప్రాంతాల్లో మాత్రమే ఉపయోగించాలి.

Share this Story:

Follow Webdunia telugu