భార్యాభర్తల అన్యోన్య దాంపత్యానికి బెడ్‌రూమ్ నిదర్శనమని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది. అది ఎరుపు నిప్పు స్థానానికి నిదర్శనమని కాబట్టి నీళ్ళకు సంబంధించిన ఆక్వేరియం, నీళ్ళ ఫోటోలు, జల పెయింటింగ్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ బెడ్‌రూమ్‌లో ఉంచకండని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది. అలా ఉంచినట్లైతే భార్యభర్తల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని ఫెంగ్‌షుయ్ చెబుతోంది.
మీ బెడ్‌రూమ్‌లో బెడ్‌ని ప్రతిఫలించేటట్లుగా ఉన్న అద్దాలను సైతం తొలగించి వేరే స్థానాల్లోకి మార్చండం ద్వారా శుభ ఫలితాలుంటాయని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది. అద్దంపై ఒక పలుచటి వస్త్రాన్ని వేయాలని, మీరు అద్దాన్ని ఉపయోగించేటపుడు మాత్రం అద్దం మీద ఉన్న వస్త్రాన్ని పక్కకు జరిపి వాడుకోవచ్చునని ఫెంగ్‌షుయ్ పేర్కొంటోంది.
రేడియో, టేప్‌రికార్డర్, స్టీరియోలు, కంప్యూటర్, టి.వి, ఫ్రిజ్, ఇంటర్‌కామ్, వీడియోప్లేయర్, హీటర్, ఎలక్ట్రానిక్ గడియారం తదితర వస్తువులు బెడ్‌రూంలో ఉండరాదని ఫెంగ్‌షుయ్ వెల్లడిస్తోంది.
ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ బెడ్‌రూమ్‌లో ఉంచితే నిద్రపోయే సమయంలో ఎలక్ట్రానిక్ వస్తువుల అయస్కాంత ప్రభావం శరీరాలపై పడుతుందని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. కొందరు తలనొప్పి, నరాల బలహీనత వంటి బాధలను భరిస్తుంటారు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ పరికరాలు వెలువరించే రేడియోషన్ మన శరీరాల్లో చొరబడి మనలను అసౌకర్యానికి గురిచేస్తాయని ఫెంగ్ షుయ్ తెలుపుతోంది.