పిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? అయితే వాళ్ళగది మార్చి చూడండని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. అలా కుదరని పక్షంలో ఆరు రాడ్‌లున్న విండ్‌చిమ్‌ను ఆ గదిలో పెట్టడం మంచిదని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. ఈ విండ్‌చిమ్‌ను లోహంతో ఏర్పాటు చేయడం మరీ మంచిది.
పిల్లలకంటూ ఒక ప్రత్యేకమైన గదిని కేటాయించినా తప్పనిసరిగా వారిని ఆ గదిలోనే కూర్చుని బెట్టి చదువుకోమని బలవంత పెట్టకండి. వీలైతే వారు చదివే 3,4 చోట్లలో గుండ్రని టేబుల్స్ ఉంచాలని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. మీ పిల్లల గదుల్లో పసుపు పచ్చ రంగు కొట్టొచ్చినట్లుగా ఉండడం వారి అనారోగ్యానికి దారి తీస్తుంది.
రోజూ నిద్రలేవగానే పిల్లలను స్పటికంలోకి చూడనివ్వండి. అది అన్ని విధాలా మిమ్మల్ని సంరక్షిస్తుందని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. రోజూ రాత్రి పడుకునే అర్ధ గంట ముందు ఆకాశంలోని ఒక నక్షత్రాన్ని చూస్తూ ఉండనివ్వండి. క్రమం తప్పకుండా దానినే చూస్తూ ఉండడం వల్ల దానికి గల కొన్ని కాస్మిక్ శక్తుల ప్రభావం పిల్లలను, పెద్దలను ఎన్నో విధాల రక్షించగలదని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.