ఇంటి స్థలాలను కొనుగోలు చేసి ఆ స్థలంలో గృహాన్నినిర్మించడంకంటే... అపార్ట్‌మెంట్‌లలో ఓ ఫ్లాట్ కొనడం మేలని కొందరు భావిస్తుంటారు. ఇంటి నిర్మాణం చేయడంలో అయ్యే ఖర్చుకు ధీటుగా.. మరికొంత వెచ్చించి అపార్ట్‌మెంట్‌లలో ఓ ఫ్లాట్‌ను కొనేయడం ప్రస్తుతం పరిపాటైంది. అయితే అపార్ట్‌మెంట్‌లు భవనానికి తగ్గట్లుగా ప్లాన్‌తో నిర్మించడం జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే.
ఇలా అపార్ట్‌మెంట్‌కు తగ్గట్లు నిర్మాణాన్ని చేపట్టడం ద్వారా ఆ ఫ్లాట్‌లలో నివసించే వారిపై కొన్ని చెడు ఫలితాల ప్రభావం ఉంటుందని ఫెంగ్‌షుయ్ పేర్కొంటుంది. ఇకపోతే... సాధారణంగా అపార్ట్‌మెంట్‌లలో హాలులోనే ఒకవైపు స్థలాన్ని డైనింగ్ హాల్, లేదా డైనింగ్ టేబుల్ కొరకు కేటాయించడం చాలా చోట్ల గమనిస్తుంటాం.
దీనితో 4,5 రకాల ఇబ్బందులు వస్తాయని ఫెంగ్‌షుయ్ అంటోంది. ప్రధాన ద్వారం నుండి నేరుగా ఇటువైపుగా "చీ" శక్తి ప్రభావం రావడంతో... అతిథుల సంఖ్య పెరుగుతుంది. పైగా ఇలా వచ్చి అలా పోయే రీతిలో ఉండడం వల్ల ఆ ఇంట్లో నివసించే వారు తృప్తిగా భుజించలేరు. ఇలాంటి ఫ్లాట్‌లలో మీరున్నట్లైతే చిన్న పార్టీషన్ లాంటి కార్డ్‌బోర్డ్‌ను గోడకు కట్టించడం మంచిదని ఫెంగ్‌షుయ్ శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. లేదా హాలుకి డైనింగ్ స్థలానికి మధ్యగా ఒక తెరను వేలాడదీయం ఉత్తమమని వారు అంటున్నారు.
అలాగే పైవిధంగా డైనింగ్ రూమ్‌ను కలిగి ఉండడం ద్వారా ప్రతి గంటకూ ఏదో ఒక చిరుతిండి తినాలనే ధ్యాస పెరిగిపోతుంటుంది. అంతేకాకుండా ఆహార నియమాలు సరిగ్గా పాటించలేరు. ఒక పద్ధతిగా తినే ధోరణి క్రమంగా మారి, ఏది అందితే అది తినే అలవాటు పెరిగి, తినే ఆహారాన్ని నెమ్మదిగా, తాపీగా జీర్ణించుకునే విధంగా కాకుండా గబగబా తినేసి బయట పడాలనుకుంటారని ఫెంగ్‌షుయ్ పేర్కొంటుంది.