గృహానికి ప్రధానద్వారం, ఇతర ముఖ్య ద్వారాలు ఫెంగుషుయ్ సూత్రాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ కోవలోనే కిటికీల అమరిక కూడా అంతేస్థానాన్ని సంపాదించుకుంటున్నాయి. ఎందుకంటే గృహంలో కిటికీల అమరిక మంచి శక్తులు ఆహ్వానించడంతో పాటు దుష్టశక్తులను వెలుపలికి పంపేదిశగా ఉపయోగపడుతాయని జ్యోతిష్క అభిప్రాయం. దీనికి అనుగుణంగా ఫెంగ్ షుయ్ కిటికీల అమరికలో కొన్నిసూత్రాలను పేర్కొంది. అందులో కొన్ని మీకోసం...
గృహంలో ఎక్కువ కిటికీలు ఉండకూడదు. ప్రతి తలుపుకు రెండు, మూడు కిటికీలు ఉంటే చాలు. అలాగే కిటికీలు ఎప్పుడు నేరుగా గృహమునందు గల ప్రధమ ద్వారానికి ఎదురుగా ఉండకూడదు. అందువల్ల మంచి శక్తి ప్రధమ ద్వారం నుంచి వచ్చి కిటికీ గుండా బయటకు వెళ్ళిపోతుంది.
గృహానికి ఎక్కువ కిటికీలు ఉంటే ధననష్టానికి, సంపద హరింప చేయడానికి చిహ్నంగా ఉంటుంది. కాబట్టి గృహంలో కిటికీలు ఏ దిశలో ఉన్నాయో ముందుగా గమనించి వాటిని అమర్చుకోవడంలో శ్రద్ధ తీసుకోండి. ఈ కిటికీలకు ఆ దిశకు సంబంధించిన దిశకు చెందిన రంగులను వేస్తే శుభప్రదమని ఫెంగ్ షుయ్ పేర్కొంటుంది.