ఫెంగ్‌షుయ్: నైరుతిలో ఎప్పుడూ మెరిసే లైట్లను వుంచకండి
, మంగళవారం, 22 జనవరి 2013 (18:18 IST)
ఫెంగ్‌షుయ్ ప్రకారం నైరుతిలో ఎప్పుడూ బాగా కాంతివంతంగా మెరిసే లైట్లను వుంచకూడదు. ఎందుకంటే ధగధగా మెరిసే ఆ లైట్సు దుష్టులకు ఆహ్వానం పలుకుతాయి. అలాగే నైరుతి వైపు ఎప్పుడూ బాగా వెలుగులు చిందించే చిహ్నాలైన షాండ్లియర్లు గాని, స్పాట్ లైట్సు గాని ఉంచకండి. అవి గనుక ఉంటే దుష్టులకు ఆహ్వానం పలికినట్లే. ఈ ప్రపంచంలో మంచివారు, చెడ్డవారు ఇద్దరూ వుంటారు. వీలైనంత వరకూ మంచి వారితో సాంగత్యం చేసి, చెడ్డవారిని వదిలించుకోవడం ఉత్తమమయిన పని. అయితే దుర్మార్గులను, దుష్టులను వదిలించుకోవడం మంచిది. ఈ నేపథ్యంలో ఫెంగ్‌షుయ్‌లో దుర్మార్గులను వదిలించుకోవడానికి ఒక పరిష్కారం వుంది. చెడ్డ ఆలోచనలు గలవారు, ఇతరులకు కీడు తలపెట్టే వారిని ఇంట్లోకి రాకుండా వుండాలంటే నైరుతిలో ఎనిమిది రాడ్‌లు వున్న ఇనుప వెండ్‌చైమ్‌ని వేలాడగట్టండియ అందువల్ల కేవలం సజ్జనులే మన ఇంటి ప్రాంగణం అడుగు పెట్టే అవకాశం వుంటుంది.