ఫెంగ్‌షుయ్: డైనింగ్ హాలు ఎలా ఉండాలో మీకు తెలుసా?
ఫెంగ్షుయ్ ప్రకారం డైనింగ్ హాలు/ భోజనాల గది ఎలా ఉండాలో మీకు తెలుసా.. అయితే ఈ కథనం చదవండి. హాలు తర్వాత ప్రథమ స్థానం ఆకర్షించే ఈ భోజనాల గది ఎప్పుడూ చక్కటి అద్దంతో ఉండాలి. ఈ గదిలో అద్దాలు మన సంపదని, ఆహారాన్ని రెట్టింపు చేసి చూపిస్తాయి. ఉత్తరం వైపు ఆద్దం వచ్చేటట్లుగా అలంకరించాలి. మరో అద్భుతమైన చిట్కా ఏమిటంటే డైనింగ్ రూంలో పండ్లు, కూరగాయలు వున్న పెద్ద పోస్టర్‌నో, బొమ్మనో అతికించవచ్చు. అలాగే ఒక పళ్ళెంలో పండ్లు ఉంచి దానిని డైనింగ్ టేబుల్‌మీద ఉంచితే అది ఇంట్లో ఆహారం సమృద్ధిగా వుందన్న భవనాన్ని ప్రతిఫలిస్తుంది. అలాగే మీ ఫ్రిజ్‌లో ఎప్పుడూ ఆహార పదార్థాలు నిండుగా ఉండేటట్లు చర్యల తీసుకోండి.