ఫెంగ్‌షుయ్: ఇంట్లోకి ప్రవేశించే మార్గంలో చెత్త ఉండకూడదట.
ఫెంగ్‌షుయ్ ప్రకారం ఇంట్లోకి ప్రవేశించే మార్గంలో చెత్తలేకుండా, కిక్కిరిసినట్టు సామాన్లు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ మార్గం ద్వారానే ప్రాణశక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కనుక అక్కడ బాగా విశాలంగా, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి.అలాగే ప్రధాన ద్వారం ఎదుట అద్దాన్ని పెట్టవద్దు. ఎందుకంటే ఇది ప్రాణశక్తిని బయటకు పంపేలా చేస్తుంది. ఇక డ్రాయింగ్ రూంకు వేసే రంగులు లేతవిగా, ఆహ్లాదం కలిగించేవిగా ఉండాలి. పేసల్ కలర్స్ అద్భుతంగా ఉంటాయి. ఇంకా ఫెంగ్‌షుయ్ ప్రకారం గదులను పరిశుభ్రంగా ఉంచుకోవడం అవసరం. అలాగే గదులలో సామాను కిక్కిరిసినట్టు లేకుండా అందంగా సర్దుకోవడం వల్ల మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇంట్లోకి గాలి వెలుతురు బాగా ప్రసరిం చేలా సామాను అడ్డం పడకుండా, మూలల్లో చెత్తలేకుండా చూసుకోవడం మంచిది.