చాలామంది అద్దాలను ఏ ప్రాంతంలో అమర్చుకోవాలనే అంశంపై తికమకపడుతుంటారు. అద్దాల అమరికపై ఫెంగ్‌షుయ్ వంటి అనేక శాస్త్రాలు పేర్కొంటున్నాయి. అయితే అద్దాలను గృహంలో ఏ ప్రాంతంలో అమర్చాలనే అంశంపై ఫెంగ్‌షుయ్ కొన్నిసలహాలను ఇస్తోంది.
ఫెంగ్‌షుయ్‌లో కొన్ని మీ కోసం.. అలంకరణలో అద్దాలను ఉపయోగించడంలో ప్రముఖ స్థానాన్ని వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. గృహంలో అద్దాలను ఎక్కడంటే అక్కడ అమర్చడం సరికాదని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. ఎలాంటి హానీ కలుగకుండా నిర్భయంగా ఉత్తర దిశలో అమర్చుకోవడం ఉత్తమమని ఫెంగ్‌షుయ్ చెబుతోంది.
ఇది ఏ గదికైనా వర్తిస్తుందని ఆ శాస్త్రం వెల్లడిస్తోంది. అదేవిధంగా హాలుకు మీ ప్రవేశ ద్వారం ఎదురుగా ఉత్తరంగా ఉన్నట్లైతే ఆ దిశగా అద్దం ఉంచరాదని ఫెంగ్‌షుయ్ పేర్కొంటోంది. మీ డ్రెస్సింగ్ టేబుల్ ఎప్పుడూ మీరు పడుకునే బెడ్‌రూమ్ మంచం ఎదురుగా అద్దం ద్వారా కన్పించకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లైతే మంచి ఫలితాలనిస్తుందని ఫెంగ్ షుయ్ తెలుపుతోంది.