ఫెంగ్ షుయ్: చిరిగిపోయిన, వెలసిపోయిన ఇంట్లో ఉంచకూడదట!
, శనివారం, 16 మార్చి 2013 (18:16 IST)
ఫెంగ్‌షుయ్ ప్రకారం ఇంట్లో పనికిరాని చెత్త అస్సలుండకూడదు. ఫెంగ్‌షుయ్ ప్రభావం కోసం ఇంటిలోని పనికిరాని వస్తువుల్ని తొలగించాల్సిందే. ఫెంగ్‌షుయ్‌కు అనుకూలమైన వస్తువులను మాత్రమే గృహంలో అమర్చుకుంటే సుఖ, సంతోషాలు వెల్లు విరుస్తాయి. రకరకాల ఫోటోలను రకరకాల దిక్కుల్లో ఉంచడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చునని ఫెంగ్ షుయ్ చెబుతోంది. అయితే కొన్ని వస్తువును ఇట్లో పెట్టుకోకూడా అవేంటో తెలుసుకుందాం...మహాభారతానికి సంబంధించిన చిత్రపటాలు మాత్రం ఇంట్లో ఉండకూడదు. మహాభారతంనకు సంబంధించిన ఏ చిత్రపటాలను ఇంటిలోపల ఉంచుకోకూడదు. ఇలాంటి చిత్రాలను, మహాభారతానికి సంబంధించిన కొన్ని గుర్తులను ఇంటిలోపల పెట్టుకోవడం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడూ వైరం సూచిస్తుంటుంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటివి ఏవీ పెట్టుకోకపోవడమే మంచిది.అలాగే అడవి జంతువుల చిత్రం, చిత్రపటాలు గృహాల్లో పెట్టుకోకూడదు. అలాంటి చిత్ర పటాలు ఉంచుకోవడం వల్ల ప్రకృతిలో ఒక హింసాత్మక విధానం తెస్తుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా మగ్గిన ఆహార పధార్థాలు, మందులు, కాలం చెల్లిన వస్తువులను వెంటనే గృహాలకు దూరంగా పారవేయాలి. చిరిగిపోయిన, వెలసిపోయిన ఫోటోలను తొలగించాలి. పగిలిన వస్తువులు, కొంతభాగం పోయిన వస్తువులు ఇంట దగ్గరకు చేరనివ్వకండి. ప్రతి పాత వస్తువు, దుస్తులు, సామాగ్రిని పూర్తిగా గృహం నుంచి దూరంగా ఉంచాలని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.