రకరకాల ఫోటోలను రకరకాల దిక్కుల్లో ఉంచడం వల్ల అనేక ప్రయోజనాలను పొందచ్చునని ఫెంగ్ షుయ్ తెలుపుతోంది. మీ గృహంలోని పడమర ప్రాంతం ఎప్పుడూ సృజనాత్మకత అంశానికి సంబంధించిందని, ఆ దిక్కు గోడపై పిల్లల ఫోటోలు ఉంచినట్లైతే వారి అదృష్టాన్ని, శక్తిని పెంపొందించినట్లవుతుందని ఫెంగ్‌షుయ్ వెల్లడిస్తోంది.
ఇంటి యజమాని ఫోటో ఎప్పుడూ రెడ్‌ఫ్రేమ్‌లో ఉంచి దక్షిణ దిక్కు వైపు ఉంచినట్లైయితే ఆ ఇంటి యజమాని పేరు ప్రతిష్టలు పెరుగుతాయని ఫెంగ్ షుయ్ పేర్కొంటోంది. నైరుతిదిశలో మీ ఆఫీస్ బాస్ లేదా మీకు సహయం చేసే వారి ఫోటోలు ఉంచినట్లైతే వారి సహాయ సహకారాలు మీకు ఎప్పుడూ అందుతునే ఉంటాయని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది.
దక్షిణ దిశలో ఎరుపురంగు ఫోటోలను ఉంచినట్లైతే మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయని, నీలం రంగు ఫోటోలను మాత్రం పొరపాటునకూడా ఉంచకూడదని ఫెంగ్ షుయ్ పేర్కొంటోంది. ఆగ్నేయదిశ.. ఎప్పుడూ సంపదకి ప్రతీక కాబట్టి పచ్చిక బయళ్ళతో ఉన్నచిత్రాలను ఉంచినట్లైతే సంపద పెరుగుతుందని ఫెంగ్ షుయ్ పేర్కొంటోంది.