ఫెంగ్ షుయ్ : డబుల్ ఫిషెస్ పిక్చర్ మీ ఇంట్లో వుందా..?
డబుల్ ఫిషెస్ పిక్చర్ మీ ఇంట్లో వుందా..? లేకపోతే.. వెంటనే కొన్ని పెట్టేసుకోండి అంటున్నారు.. ఫెంగ్ షుయ్ నిపుణులు. ఫెంగ్‌షుయ్ ప్రకారం డబుల్ ఫిష్ పిక్చర్ ఇంట్లో ఉంటే సానుకూల ఫలితాలు చేకూరుతాయని వారు సూచిస్తున్నారు. ఇంట్లో డబుల్ ఫిష్‌తో కూడిన చిత్రపటాన్ని ఉపయోగించడం ద్వారా సంపద, సమృద్ధి, శ్రేయస్సుకు ఎలాంటి ఢోకా ఉండదు. అష్టైశ్వరాలు చేకూరేందుకు ఈ డబుల్ ఫిషెస్ ఇమేజ్‌ను ఇంట్లో వుంచుకోవడం చాలా మంచిదని ఫెంగ్‌షయ్ నిపుణులు చెబుతున్నారు. ఫెంగ్ షుయ్ ఛీ ప్రవాహం ద్వారా ఇంటి యజమానికి ఈ బొమ్మ సానుకూల ఫలితాలను ఇస్తుంది. అయితే ఈ ఫిష్‌ను టేబుల్ మీద గానీ గోడమీద ఇంటికొచ్చే అతిథుల కంటపడేలా పెట్టాల్సి వుంటుంది. ఈ రెండు ఫిష్‌లను బంగారం పూతతో చేయించుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఈ డబుల్ ఫిషెస్‌ను ఫ్రేమ్ చేసుకుని గోడకు తగిలించవచ్చు. ఈ బొమ్మ 8″ x 8″ వుండేలా చూసుకోవాలి.