చాలామంది పాత భవనాలను కొన్ని కూల్చివేసి కొత్తవి నిర్మించుకుంటారు. కాని ఫెంగ్‌షుయ్ ప్రకారం అలా పాత భవనాలను కూల్చివేసి కొత్తవి కడితే చాలా ప్రమాదాలు జరుగుతాయని, కావాలనుకుంటే పాత బిల్డింగ్‌నే మరమ్మతులు చేసుకుని వ్యాపారం మొదలు పెట్టవచ్చని ఫెంగ్‌షుయ్ పేర్కొంటోంది.
బిల్డింగ్‌ని కూల్చడం ఏ మాత్రం మంచిదికాదని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది. ఎందుకంటే చైనీయులు పాత భవనాలను అలనాటి చిహ్నంగా భావిస్తారు. అందుకే చైనీయులు ఎవ్వరూ పాత బిల్డింగ్‌లను కూలదోసి కొత్తవి కట్టడానికి సాహిసించరని, ఒకవేళ అలాచేస్తే తమకు తామే మరణశాసనం రాసుకున్నట్లుగా భావిస్తారని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది.