పడకగదిలో గాలి - వెలుతురు వచ్చేలా చూసుకోవాలి!!
, మంగళవారం, 29 ఏప్రియల్ 2014 (12:17 IST)
పడకగదిలో ఎల్లప్పుడూ గాలి, వెలుతురు ఉండేలా.. "చి" ప్రవాహానికి వీలుగా ఉంచుకోవాలని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు. బెడ్‌రూమ్ కిటికీని ప్రతిరోజూ కనీసం ఓ అర్థగంటైనా తెరిచి సహజమైన వెలుతురు, గాలి వచ్చేలా చూడాలని సలహా ఇస్తున్నారు. లేకపోతే... దుష్టశక్తులు తిష్టవేస్తాయని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది. దీనివల్ల మీరు క్రమంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని ఫెంగ్‌షుయ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే.. మీ పడకగదిలో ఉండే దిండ్లు చతురస్రాకారంలో ఉండాలి. చతురస్రాకారంలో ఉండే దిండ్లను ఉపయోగించడం ద్వారా మీలో నూతన ఉత్తేజం, శక్తి పెంపొందుతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు చెబుతున్నారు. అలాగే దిండ్లు పసుపు పచ్చరంగులో ఉంటే చాలా మంచిది. ఇకపోతే.. మీ బెడ్‌రూమ్‌లో దీర్ఘచతురస్రాకారంలో ఉండే అద్దాలకంటే చతురస్రాకారంలో ఉండే ఎక్కువ మేలు చేస్తాయి. ముఖ్యంగా ఇవి మీలో స్థిరమైన నిర్ణయాలు తీసుకొనగలిగే శక్తిని పెంపొందిస్తాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు చెబుతున్నారు.