Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పడక గదిలో రాత్రిపూట నిద్రపట్టడం లేదా?

పడక గదిలో రాత్రిపూట నిద్రపట్టడం లేదా?
, బుధవారం, 16 ఏప్రియల్ 2014 (17:25 IST)
File
FILE
ప్రతిరోజూ వివిధ రకాలైన సమస్యలతో తీవ్రమైన ఒత్తిడిని ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటుంటారు. దీంతో రాత్రి పూట పడక గదిలో నిద్రపట్టదు. సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే తపనతో కృషిచేస్తోన్న పలువురికి ఏదో ఆలోచనలు.. నిద్రపట్టే సమయానికి ముందే మదిలో మెదులుతుంటాయి. అలాంటి ఆలోచనలను దూరంగా ఉంచి సుఖంగా నిద్రపోయేందుకు ఫెంగ్‌షుయ్ నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు.

అవి ఏమిటంటే..? వీలును బట్టి మీ బెడ్‌రూమ్‌కు దగ్గర ఒక విండ్‌చిమ్‌ని ఏర్పాటు చేసుకోండి. లేదా నైరుతి మూలలో ఒక క్రిస్టల్‌ను వేలాడదీయండి. బెడ్‌రూమ్‌లో ఎరుపు రంగు బెడ్‌లైట్ లేదా పసుపు పచ్చ, ఆకుపచ్చ రంగు బల్బును వాడండని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మీ బెడ్‌ను ప్రతిఫలించే విధంగా ఏ రకమైన అద్దం బెడ్‌రూమ్‌లో ఉండకుండా చూసుకోండి.

ముందుగా మీరు పడుకునే మంచం గోడకు ఆనుకుని (సపోర్ట్‌గా) వుండాలి. గోడ నుంచి ఒక అడుగు దూరం స్థలాన్ని వదిలేసి మంచాన్ని వేసుకోండి. అంతేగాకుండా చాలామంది గాలి బాగా వస్తుందని కిటికీ, ద్వారం దగ్గర మంచాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఫెంగ్‌షుయ్ ప్రకారం అది తప్పు. మీ మంచం కిటీకీలకు, తలుపులకు దూరంగా ఉండాలి.

అలాగే నిద్రించే ముందు.. మంద్రంగా వినిపించే సంగీతం వింటే మెల్లగా నిద్రలోకి జారుకుంటారని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. సముద్రపు అలల శబ్దమో, సెలయేరు శబ్దమో, నీళ్ళపై నుండి క్రిందకు పడుతున్న శబ్దమో వింటే.. అలసిన మనసు నిద్రలోకి చేరుకుంటుదని వారు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu