పడక గదిలో ముగ్గురు వ్యక్తులున్న ఫోటో తగిలించకూడదా?
చాలా గృహాల్లో వివిధ రకాలైన గ్రూపు ఫోటోలు ఉంటాయి. కొంతమంది దంపతులకు తమకున్న ఏకైక సంతానంతో ఫోటో దిగి దాన్ని తమ బెడ్ రూమ్‌లో ఉంచుకుంటారు. ఫెంగ్‌షుయ్ (చైనా వాస్తు శాస్త్రం) ప్రకారం ముగ్గురున్న వ్యక్తుల ఫోటోలను పడక గదిలో తగిలించరాదని సూచిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. అసలు ఈ వాస్తు ప్రకారం ముగ్గురు వ్యక్తులు వరుసగా నిలబడివున్న ఫోటోలు మంచివే కావంటున్నారు. అలా ఫోటోల్లో ముగ్గురు వ్యక్తులు ఉంటే అది సంఘర్షణకు దారితీస్తుందనేది చైనీయుల నమ్మకం. అందుకే చైనాలో చాలా మంది ఆర్టిస్టులు అలా ముగ్గురు వ్యక్తులున్న ఫోటోలు, పెయింటింగ్‌లను వేయడానికి సాహసించరని వాస్తు నిపుణులు చెపుతున్నారు. ఎందుకంటే ముగ్గురు వ్యక్తులు ఉన్న ఫోటోలోని మధ్య వ్యక్తి ఎప్పటికైనా విడిపోతారని చైనీయులకు గట్టి నమ్మకమట. అందుకే ముగ్గురు స్నేహితులు కలిసి ఫోటో దిగకపోవడమే మంచిదని వారు చెపుతున్నారు.