Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పడక గదిలో పింక క్రిస్టల్ ఉంచితే పెళ్లి సంబంధాలు వస్తాయా?

Advertiesment
ఆధ్యాత్మికం
, గురువారం, 6 మార్చి 2014 (19:04 IST)
File
FILE
మీ అమ్మాయికి, లేదా అబ్బాయికి పెళ్లి సంబంధం కుదరలేదా? అయితే మీ పిల్లల బెడ్‌రూమ్‌లో హృదయాకారంలో ఉన్న రెండు పింక్ క్రిస్టల్స్‌ ఉంచడం శ్రేయస్కరమని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. ఇలా ఉంచినట్లయితే, వారికి మంచి పెళ్లి సంబంధాలు రావడం, పెళ్లి కుదరడం జరుగుతుందని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది.

అదేవిధంగా క్రిస్టల్ గ్లోబ్‌ను పిల్లల టేబుల్ మీద ఈశాన్యంలో ఉంచడం ద్వారా మీ పిల్లల విద్యా, జ్ఞాపక శక్తి బాగా అభివృద్ధి చెందుతుంది. క్రిస్టల్‌ గ్లోబును మీ టేబుల్ మీద ఈశాన్యంలో ఉంచి, ప్రతిరోజూ మూడుసార్లు ఆ గ్లోబును తిప్పినట్లైతే, మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది.

ఇకపోతే నిజమైన క్రిస్టల్‌తో చేసిన ఓ వస్తువైనా అంటే... క్రిస్టల్ చెట్టు, క్రిస్టల్ పేపర్ వెయిట్, క్రిస్టల్ గ్లోబ్ వంటి వస్తువులను మీరు వాడే టేబుల్‌ ఎడమచేతివైపు ఉంచడం ద్వారా కెరీర్‌‌లో అభివృద్ధి చెందుతారని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

ఇదిలావుండగా భూమి నుంచి తీసిన రియల్ క్రిస్టల్ రాయిని వాస్తు దోషమున్న చోట పెట్టడం ద్వారా ఆ దోషము తొలగిపోవునని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది.

Share this Story:

Follow Webdunia telugu