పడక గదిలో అహ్లాదకర వాతావరణం : ఫెంగ్‌షుయ్ సూత్రాలు
, శనివారం, 16 మార్చి 2013 (18:26 IST)
సాధారణంగా ప్రతి ఒక్కరూ పడక గది మరింత ఆహ్లాదకరంగా ఉండాలని కోరుకుంటారు. ఇందుకు తమకు తోచిన రీతిలో అలంకరించుకుంటారు. అయితే, ఫెంగ్‌షుయ్ శాస్త్రం ప్రకారం బెడ్‌రూమ్‌ను అలంకరించుకుని కొన్ని సూచనలు పాటిస్తే సరిపోతుందని నిపుణులు చెపుతున్నారు. ముఖ్యంగా పెళ్లైన మొదటి రోజుల్లో బెడ్‌రూమ్‌ని ఎరుపు రంగులతో అలంకరించాలని ఫెంగ్‌షుయ్ నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే ఎరుపు రంగు డైనమిజానికి చిహ్నమట. అలాగే పెళ్లైన కొత్త దంపతులు వాడే బెడ్ రూమ్‌లో తెల్లని బెడ్‌షీట్‌లకు వాడకూడదని సూచన చేస్తున్నారు. బెడ్‌రూమ్‌లో ఎప్పుడూ మొక్కలను, పువ్వులను ఉంచకూడదు. అలాగే మీ పడకగదిలో అక్వేరియం, ఫౌంటెన్‌వంటివి కూడా ఉంచడం మంచిది కాదని చెపుతున్నారు. ఎందుకంటే అవి దంపతుల మధ్య తగాదాలకు, నిద్రలేమి రాత్రులకు దారితీస్తాయని చెపుతున్నారు. ముఖ్యంగా.. బెడ్‌రూమ్‌లో పెళ్లైన దంపతులున్న పెయింటింగ్‌లను ఉంచినట్టయితే.. భార్యా భర్తల దాంపత్యం జీవితం వెయ్యేళ్ళు వర్థిల్లుతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు చెపుతున్నారు.