పచ్చని మొక్కలను మీ గృహానికి తూర్పు వైపు నాటండి..!
పచ్చని రంగుతో కూడిన పళ్ళు, మొక్కలను మీ గృహానికి తూర్పు వైపు నాటడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయి. అలాగే మీ గృహంలో తూర్పు దిశలో పచ్చని మొక్కలను పూలకుండీల్లో పెడితే శుభఫలితాలుంటాయి. అయితే కిటికీకి ఎదురుగా పెద్ద చెట్లుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి ఎదురుగా విండ్‌చిమ్ పెట్టకూడదు. ఇలా విండ్‌చిమ్‌ను పెడితే దాని శబ్ధంతో దుష్టశక్తులకు ఆహ్వానం పలుకుతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇంట్లో చింతచెట్టు ఉండకుండా చూసుకోండి. అలాగే ఒక ఇంటికి నుంచి ఇంకొక ఇంటికి మారెటప్పుడు ముందుగా మీకు ఇష్టమైన వస్తువులను తీసుకెళ్ళండి. దేవుని పటాలు వంటివి తీసుకెళ్లడం, మీకిష్టమైన వస్తువులను తీసుకెళ్లండి. అలాగే కొత్తింటికి వెళ్తున్నప్పుడు వంటగదిని ఫెంగ్‌షుయ్ ప్రకారం ఏర్పాటు చేసుకోండి. వంట చేస్తున్నప్పుడు తూర్పు అన్నివిధాలా మంచి ఫలితాలనిస్తుంది. అయితే పశ్చిమం గృహిణులను నిస్సత్తువగా చేస్తుంది. ఇక దక్షిణమైతే దారిద్ర్య దేవతను మీరే ఆహ్వానం పలికినట్లవుతుంది. ఉత్తరమైతే.. కుటుంబ కలహాలకు దారితీసే పరిస్థితులు ఏర్పడతాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.