గాలి, నీరు, వెలుగు ఎంత ముఖ్యమో శుభ్రత కూడా అంతే ముఖ్యమని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది. ఇంట్లో పనికిరాని వస్తువులు ఉంటే తీసి బయటపారేయాలన్నది ఫెంగ్‌షుయ్ వెల్లడిస్తున్న ప్రథమ సూత్రం.
ఈ కోవలోనే మనం ధరించే దుస్తులు పరిశుభ్రమైనవిగా ఉండాలని, ఎందుకంటే వ్యక్తి వేసుకునే డ్రస్‌ని బట్టి అతని ప్రవర్తనని తేలికగా తెలుసుకోవచ్చునని ఫెంగ్‌షుయ్ పేర్కొంటోంది.
ఇటీవల కుర్రకారు ఫ్యాషన్ల పేరుతో షర్ట్స్, ఫ్యాంట్‌లు వంటి వివిధ రకాలైన దుస్తులను ధరించడం గమనిస్తూనే ఉన్నాం. ఇటువంటి దుస్తుల్లో రంధ్రాలు, చిరిగి ఉండటాన్ని ఫ్యాషన్ అంటున్నారు. అయితే ఇలా వేసుకుతిరగడం దారిద్ర్యానికి చిహ్నమని ఫెంగ్‌షుయ్ అంటోంది. ఆఫీసు నుండి రాగానే బద్ధకం వదిలించుకుని బట్టలు తీసేసి, వేరే బట్టలు వేసుకోండని, ఎప్పుడూ చూసినా కడిగిన ముత్యంలా ఉన్న వారి ఇంటిని లక్ష్మీదేవి వరిస్తుందని ఫెంగ్‌షుయ్ పేర్కొంటోంది.
రాత్రిపూట బట్టలు ఉతకటం మంచిదికాదని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది. అలా రాత్రిపూట బట్టలను ఉతికి ఆరేసిన బట్టలను దుష్టశక్తులు, అతీత శక్తులను ఆకర్షిస్తాయని చైనీయుల నమ్మకం.