డ్రాయింగ్ రూమ్‌లో అద్దాలు ఏర్పాటు చేస్తున్నారా?
, మంగళవారం, 23 ఏప్రియల్ 2013 (14:42 IST)
డ్రాయింగ్ రూమ్‌లో అద్దాలు ఏర్పాటు చేస్తున్నారా? అయితే అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. డ్రాయింగ్ రూమ్‌లో అద్దాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే వాటిని సరిగా పెట్టకపోతే ప్రతికూల శక్తి ప్రవహిస్తుంది.అందుకే వాటిని ఏర్పాటు చేసే సమయంలో అవి మీకిష్టమైన వాటిని, మీరు పదే పదే చూడాలనుకునే వాటినీ ప్రతిఫలించేలా ఏర్పాటు చేసుకోండి. ఉదాహరణకు కిటికీలోంచి మీకిష్టమైన సీనరీని చూసేలా ఏర్పాటు చేసుకోవచ్చు. డ్రాయింగ్ రూంను అట్టహాసంగా ఏర్పాటు చేసుకుంటున్నామనే భావనతో కిక్కిరిసిపోయినట్టుగా ఫర్నిచర్‌ను పెట్టకూడదు. అలాగే టీవీని లేదా సౌండ్ సిస్టంను పెట్టకూడదు. ఎందుకంటే టీవీ తాలూకు ఎలక్ట్రో మాగ్నెటిక్ తరంగాలు ప్రాణ శక్తి ప్రవాహానికి అడ్డు తగలవచ్చునని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.