చేతులు లేని కుర్చీలు దురదృష్టానికి ప్రతీకట!
, శనివారం, 21 ఏప్రియల్ 2012 (17:37 IST)
ఫెంగ్‌షుయ్ ప్రకారం చేతులు లేని కుర్చీలు దురదృష్టానికి ప్రతీకట. ఫెంగ్‌షుయ్ సూత్రాల ప్రకారం మీరు కూర్చునే కుర్చీ, టేబుల్ సైతం అదృష్టాలను ప్రభావితం చేస్తాయి. ముందుగా మీరు కూర్చునే కుర్చీ వెనక సపోర్ట్ ఉండేలా చూసుకోండి. కొన్ని కుర్చీలు కేవలం నడుందాకే వుంటాయి. అలా గాకుండా మీ వీపు ఆ కుర్చీకి ఆనుకునేలా వెనకాల చెక్క వుండాలి. అలాగే మీరు కూర్చునే కుర్చీలో చేతులు ఉంచుకునేలా అంచులు ఉండాలి. చేతులు లేని కుర్చీలు దురదృష్టానికి ప్రతీక అని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. అలాగే మీ డెస్క్‌కి కాళ్లు డెస్క్ చివర ఉండాలి. కొన్ని డెస్క్ (టేబుళ్ల)కి కాళ్ళు టేబుల్ మధ్యలో ఉండటం చూస్తుంటాం. అలాగాక డెస్క్ లేదా టేబుల్‌కి నాలుగు వైపుల చివర కాళ్ళు ఉంటేనే అదృష్టం దరిచేరుతుందని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది. మీరు కూర్చునే టేబుల్స్ వెనుక లేదా ముందు గోడలపై పర్వతాలు గల సీనరీలను తగిలించుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే కిటికీల పక్కనే మీ కుర్చీలను ఏర్పాటు చేసుకోవడం కూడదు. కిటీకీల దగ్గరే కుర్చీలను ఏర్పాటు చేసి కూర్చోవడం ద్వారా మానసిక ఒత్తిడి పెరుగుతుందని, ఆత్మవిశ్వాసం లోపిస్తుందని ఫెంగ్‌షుయ్ చెబుతోంది.