గృహ నిర్మాణంలో ఫెంగ్‌షూయ్ సూత్రాలను ప్రకారం మీరు కూర్చునే కుర్చీ, టేబుల్ సైతం అదృష్టాలను ప్రభావితం చేస్తాయి. ముందుగా మీరు కూర్చునే కుర్చీ వెనుకాల ఆధారం ఉండాలి. కొన్ని కుర్చీల కేవలం నడుందాక ఆనుకోని విధంగా ఉంటాయి.
అలా కాకుండా మీ వీపు ఆ కుర్చీకి అనుకునేలా వెనకాల చెక్క ఉండాలి. అలాగే మీరు కుర్చునే కుర్చీలో చేతులు ఉంచుకునేలా అంచులు ఉంచాలి. చేతులు లేని కుర్చీలు దురదృష్టానికి ప్రతీక అని గుర్తు తెచ్చుకోండి.
అలాగే మీ డెస్క్‌కి కాళ్ళు డెస్క్ చివర ఉండాలి. కొన్ని డెస్క్ (టేబుళ్ళ)కి కాళ్ళు టేబుల్ మధ్యలో ఉండటం మనం చూసే ఉంటాం. అలాగాక డెస్క్ లేదా టేబుల్‌కి నాలుగు వైపుల చివర కాళ్ళు ఉంటేనే అదృష్టం దరిచేరుతుందని ఫెంగ్‌షూయ్ శాస్త్రం పేర్కొంటుంది