ఇంటిలో శుభకరమైన శక్తిని పొందడానికి గడియారాలను ఫెంగ్‌షుయ్ నిపుణులు రికమెండ్ చేస్తారు. ఎందుకంటే గడియారంలో ముళ్ళు లేదా పెండ్యూలయం లయబద్ధంగా కదులుతూ ఉంటే మంచి ఫలాలను అందిస్తోందని ఫెంగ్‌షుయ్ పేర్కొంటోంది. అలాంటి గడియారాన్ని హాలులో ఎడమవైపు, ముందుగోడకుగానీ ఉండవచ్చునని, అయితే ఇంటి సింహద్వారానికి ప్రత్యక్షంగా మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఉంచకూడదని ఫెగ్‌షుయ్ పేర్కొంటోంది.
పనిచేయని గడియారాలను ఇంటిలో ఉంచకూడదని, అలా ఉంటే వాటిని వెంటనే మరమ్మత్తు చేసి వినియోగించాలని ఫెంగ్‌షుయ్ సూచిస్తోంది. చాలామంది పెళ్లిళ్ళలో, ఇతర వేడుకలలో గడియారాలను కానుకలుగా ఇస్తుండటం మనం చూస్తుంటాం. కానీ గడియారాలను బహుమతిగా స్వీకరిచకూడదని, దానిని ఎవ్వరికి బహుమానంగా కూడా ఇవ్వకూడదని ఫెంగ్‌షుయ్ పేర్కొంటోంది.
గడియారాలను బహుమానంగా తీసుకున్న వారిటైమ్ అయిపోయినట్లుగా చైనీయుల భావిస్తున్నారని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది. కాబట్టి గడియారాలను స్వయంగా కొనుక్కుని ఇంట్లో ఉంచుకోండని, ఇతరులకు ఇచ్చేందుకు వచ్చిన సున్నితంగా వారించడం మంచిదని ఫెంగ్‌షుయ్ చెబుతోంది.