చైనా వంటి దేశాల్లోని రెస్టారెంట్‌లలో గల గల మోగే గంటలు కట్టి ఉంచుతారు. గంటలు అలా మోగడంవల్ల చెడు శక్తిని తరిమేస్తుందని చైనీయులు భవిస్తారు. ఫలితంగా వినియోగదారులు మన షాపులోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది.
ఏ లోహంతోనైనా గంటలను తయారుచేసినా ఒక ఎర్రటి రిబ్బన్‌తో మీ షాపు ప్రధాన ద్వారం తలుపుకు వెనకాల (ఇంటి లోపల నుంచి) తలుపు గడియకి కడితే, తలుపు తీసినప్పుడల్లా వచ్చే ఆ గంటల శబ్దం శుభసూచనగా భావిస్తారని ఫెంగ్‌షుయ్ వెల్లడిస్తోంది.
ఈ లోహ గంటల సంఖ్య సుమారు ఆరు లేక మూడు గంటలు ఉంటే మంచిదిగా చైనీయులు భావిస్తారని ఫెంగ్‌షుయ్ వెల్లడిస్తోంది. అయితే లోహ గంటలతోపాటు మూడు చైనీస్ నాణేలను రబ్బన్ తోకకట్టినవి కూడా కలిపి తలుపు వెనకాల ఉంచితే ఇక వ్యాపార, వ్యక్తిగతరీత్యా మీకు తిరుగు లేదని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది.