Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాంపౌండ్‌వాల్‌తో గృహానికి రక్షణ

Advertiesment
కాంపౌండ్‌వాల్‌తో గృహానికి రక్షణ
, సోమవారం, 28 జులై 2008 (18:34 IST)
గృహాంలోకి ప్రవేశించే దుష్ట శక్తులను వెళ్ళగొట్టడానికి కాంపౌండ్ గోడను నిర్మించుకోవడం మంచిదని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది. చాలామంది అదొక ఖర్చు ఎందుకని చుట్టూ... కంచె కట్టుకుని కాలం గడుపుతుంటారు. కాని ఫెంగ్‌షుయ్ ప్రకారం ఇంటి చుట్టు కాంపౌండ్ నిర్మించుకోవడంవల్లే పక్కింటి నుండి వెలువడే చెడుశక్తులను అరికట్టవచ్చునంటోంది.

కాంపౌండ్ గోడను నిర్మించుకునేప్పుడు ఈ క్రింది ఫెంగ్‌షుయ్ విధానాలను పాటిస్తే ఫలితముంటుంది. గృహానికి కాంపౌండ్‌వాల్ ఎత్తు అన్నివైపులా సమానంగా ఉండేటట్లు నిర్మించుకోవాలని, ఒక దిక్కులో ఎక్కువ, మరోదిక్కులో తక్కువలు ఉండకూడదని ఫెంగ్‌షుయ్ పేర్కొంటోంది.

కాంపౌండ్‌ గోడ మరీ ఎత్తులో ఉండకూడదని, సాదారణంగా కాంపౌండ్ గోడ మీరు నిలబడి ఉన్నచోట మీ భుజాలదాకా రావాలని ఫెంగ్‌షుయ్‌ తెలుపుతోంది. చాలా మంది రాజకీయ వాదులు, సినిమా తారలు తమ వ్యక్తిత్వ రక్షణ కోసం కాంపౌండ్ గోడను చాలా ఎత్తుగా నిర్మించుకుంటారు. అలా నిర్మించుకోవడం చాలా తప్పుని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది.

ఎందుకంటే చెడు శక్తులు లోనికి ప్రవేశనింపకుండా చేస్తుందని ఫెంగ్‌షుయ్ అంటోంది. మరోవైపు ఎత్తుగా నిర్మితమైన కాంపౌండ్ గృహాల్లోకి ప్రవేశించునపుడు తామెదో గుహలోబందీ అయినట్లు భావన కలుగుతుందని ఫెంగ్‌షుయ్ వెల్లడిస్తోంది. ఈ సమస్యలకు పరిష్కారం ఏమిటంటే... గృహ కాంపౌండ్ వాల్‌ని నిర్మించి, ఆ పైనుండి ఏదైనా ఇనుప గ్రిల్ లేదా ఇనుప తెరలను ఉంచడం ద్వారా మీ వ్యక్తిగత రక్షణని పొందవచ్చునని, ఇలా నిర్మించుకోవడం వల్ల మంచిశక్తి సైతం మీ గృహంలోనికి ప్రవేశిస్తుందని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది.

Share this Story:

Follow Webdunia telugu