Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒకే మంచంపై రెండు పరుపులు వేసుకుని నిద్రిస్తే అశుభమా?

Advertiesment
పడకగది
, బుధవారం, 14 మే 2014 (17:52 IST)
File
FILE
పడకగదిలో ఒకే డబుల్‌కాట్ మంచం మీద రెండు పరుపులు వేసుకుని శయనించడం అశుభమని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. ముఖ్యంగా దంపతులు ఒకే డబుల్ కాట్ మంచం మీద రెండు పరుపులు వేసుకుని శయనించడం కూడదని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. ఇలా రెండు పరుపుల మీద పడుకున్న దంపతులు కాలానుగుణంగా విడిపోతారని వారు చెబుతున్నారు.

కానీ దంపతులిద్దరూ.. ఒక మంచంపై ఒకే పరుపును ఉపయోగించడం ద్వారా ఇరువురి మధ్య అన్యోన్యత పెరుగుతుందని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. ఇంకా పిల్లలు లేని దంపతులు బెడ్‌కి సమీపంలో చిన్న పిల్లలున్న బొమ్మలను గాని, పెయింటింగ్‌గాని వేలాడదీయడం మంచిది. అలాగే ప్రకృతి లేదా అందమైన మహిళలల పెయింటింగ్‌లను అంటించడం చేయాలని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా దంపతులు శయనించే చోట పై కప్పు మీద దూలం ఉండకుండా చూసుకోవాలి. అలాగే మంచానికెదురుగా టాయ్‌లెట్‌గాని, అద్దాలు గాని, ఎలక్ట్రానిక్ వస్తువులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది. ఇలా చేస్తే దంపతుల మధ్య మంచి అవగాహన, వంశాభివృద్ధి చేకూరుతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu