Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉత్తర, వాయువ్య దిశల్లో మెట్లుంటే.. దురదృష్టం తప్పదట!

Advertiesment
ఉత్తరం
, గురువారం, 13 డిశెంబరు 2012 (17:46 IST)
FILE
ఇంటి మధ్య భాగంలో మెట్లు ఉండకూడదని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. ఇంటి మధ్యలో మెట్లు ఉంటే కుటుంబంలో కలహాలు రావచ్చునని వారు హెచ్చరిస్తున్నారు. అలాగే ఉత్తరం లేదా వాయువ్య దిశలలో మెట్లుండటం వల్ల దురదృష్టం వెంటాడుతుంది. అయితే ఎక్కువ శాతం వరకు మెట్ల స్థానాలలో లేదా దిశలలో ఉండే దోషాలు వంపుగా రెండు సార్లు తిరిగే మెట్లవల్ల పోతాయి.

భారతీయ వాస్తులో ఇలా రెండు దిశలలో వంపులు ఎటునుండి ఎటు ఉండాలో స్పష్టంగా ఉంటుంది. కాబట్టి సాధారణంగా ఎలాంటి మెట్లలోని దోషాలైనా వంపు తిరగడంతో పోయినట్లే చెప్పుకోవాలి.

ఒకవేళ మీ మెట్ల విషయంలో మీకేమైనా అనుమానం ఉందనుకుంటే.. మీ బాఘువా ప్రకారం మీకు అనుకూలించే రంగులో బల్బును వెలిగించుకోండి. ఆ రంగు బల్పుని మెట్ల కింద 24 గంటలూ 21 రోజుల నుంచి మెట్ల క్రిందగా పైభాగాన వేలాడదీయండి. మెట్ల క్రింది స్థలంలో సాధ్యమైనన్ని మొక్కలను పెట్టండి.

కొన్నిసార్లు అలా పెట్టిన మొక్కలు ఊరికే వాడిపోవచ్చు. అలాగైతే 2, 3 సార్లు మళ్ళీ మొక్కలు పెట్టండి. నిజానికి అలా మొక్కలు చనిపోతున్నాయంటే అంతవరకు పేరుకుని ఉన్న చెడు శక్తిని అవి హరించుకుపోయాయని అర్థం.

అలాగని మొక్కలు బాగా ఉంటే మీ దోషాలు పోలేదని కాదు. మీ దోషం చాలా తక్కువ స్థాయిలోనిదని అర్థం చేసుకోవాలి. మెట్ల చాలా ఇరుకుగా లేదా జారిపడినంత వెలుతురు లేనట్లుగా ఉన్నదనిపిస్తే పై భాగాన కొద్దిగా కోణం చేస్తూ (పూర్తిగా మెట్లు ఎక్కుతున్న మిమ్మల్ని ప్రతిఫలించేట్లుగా కాక) ఒక అద్దాన్ని ఉంచండి. రెండడుగుల అద్దం చాలు. ఇది మెట్లకి దగ్గరగా, ఎదురుగా, వెనుకగా వంటగది ఉండరాదు.

Share this Story:

Follow Webdunia telugu