ఆరంజి తొక్కతో మిమ్మల్ని మీరో రక్షించుకోవచ్చునని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. అదేమిటబ్బా? అని ఆశ్చర్యపోకండి. నిజమేనండీ., బ్యాంక్‌లోన్ కోసం మేనేజర్‌ని కలువబోతున్నారా? ఏదేని ముఖ్యమైన ఇంటర్వ్యూలో పాల్గొనబోతున్నారా? లేదా మీ బాస్‌ని మీటింగ్‌లో కలిసేందుకు భయపడుతున్నారా?.. ఇలాంటి వారు మీరైతే ఉదయం ఒక ఆరంజ్ తొక్కను వలచి దానిని తొమ్మిది ముక్కలు చేసి జేబులో ఉంచుకోండి. ఇలా చేస్తే భయం పోతుందని, కొత్త ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఫెంగ్‌షుయ్ శాస్త్రకారులు చెబుతున్నారు.
ఫెంగ్‌షుయ్‌లో చాలా అభిలాషణీయమైన సంఖ్య తొమ్మిదని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. దీని ప్రకారం 9 సంఖ్య అంటేనే ఏ కార్యమైనా సుముఖంగా పూర్తవుతుందని ఫెంగ్‌షుయ్ నిపుణుల విశ్వాసం.
కాబట్టి ప్రతిసారి విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ జేబుల్లో తొమ్మిది ముక్కలుగా చేసిన ఆరంజి తొక్కను ఉంచుకోవడం మంచిదని వారు అంటున్నారు. దీని ద్వారా జరుగబోయే దృశ్యాలను మీ కళ్ళముందుంచిన అనుభూతిని పొందుతారని ఫెంగ్‌షుయ్ పేర్కొంటుంది.