గృహంలోని సగభాగాన్ని కొందరు ఆఫీసు కోసం కేటాయిస్తుంటారు. ఇలా, ఇల్లు, ఆఫీసు ఒకటైతే... కొన్ని ఫలితాలు సంభవిస్తాయని ఫెంగ్‌షుయ్ అంటోంది. దీనికోసం కొన్ని నియమాలను పాటించాలని ఫెంగ్‌షుయ్ శాస్త్ర కారులు అంటున్నారు. సాధ్యమైనంత వరకు తూర్పుదిశగా ఉన్న గదిని ఆఫీస్ రూమ్ కోసం కేటాయించడం శ్రేయస్కరమని ఫెంగ్‌షుయ్ శాస్త్రం అంటోంది.
ఇలా... తూర్పుదిశగా కేటాయించిన ఆఫీస్ గదికి దగ్గరగా, కిచిన్ గాని, పడకగది గానీ ఉండకుండా చూసుకోవాలి. ఇకపోతే... బొమ్మల తయారీ, చక్కని చేతి అల్లికలు వంటి వ్యాపారం మీరు చేస్తున్నట్లైతే పశ్చిమ లేదా వాయువ్య దిశలో ఆఫీసు గది ఉండే విధంగా చూసుకోవాలని ఫెంగ్‌షుయ్ చెబుతోంది.
నిపుణులు సూచిస్తే తప్పనించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎర్రని సోఫాను మీ ఆఫీసు గదిలో ఎక్కడా పెట్టే ప్రయత్నం చేయొద్దని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది.
అదేవిధంగా, మీ ఆఫీసు భవనానికి ఆకుపచ్చ లేదా నీలిరంగులను సమపాళ్ళలో కలిపినట్లు ఉండే పెయింటింగ్‌ను ఉపయోగించుకోండి. ఇలా రంగులను మార్చని పక్షంలో వ్యాపారంలో నష్టం, అడ్డంకులు కలుగుతాయి. అంతేకాకుండా ఆఫీసు యజమానులు అనారోగ్యం బారిన పడుతారని ఫెంగ్‌షుయ్ శాస్త్ర నిపుణులు అంటున్నారు.