మీ ఆఫీసును అందంగా తీర్చుకోవడంలో పెయింటింగ్ చాలా ముఖ్యత్వం వహిస్తుంది. ఆఫీసును కళాత్మకంగా ఉంచుకోవడం ద్వారా అదృష్టాన్ని పొందవచ్చునని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. ఈ శాస్త్రం పేర్కొంటున్న కొన్ని పెయింటింగ్ ప్రాధాన్యత సలహాలు మీ కోసం.. మీరు కూర్చునే సీటు వెనుక ఒక పర్వతం పెయింటింగ్, అదే విధంగా మీ కుర్చీ ముందు ఒక నీళ్ళ లక్షణంలో ఉన్న వస్తువుని ఉంచితే క్షేమదాయకం. అలాగే మీ కుటుంబ ఆరోగ్యం కోసం దిక్కుల్లో పండ్లు, పువ్వులున్న పెయింటింగ్‌ను ఉంచండి. మీ ఆఫీసుల్లో మాత్రం పొరపాటున ప్రేమకు సంబంధించిన పెయింటింగ్‌లు ఉంచొద్దు.
అలాగే క్రూర జంతువులు ఉన్న పెయింటింగ్‌లను ఉంచకండి. ఆఫీసుల్లో యుద్దం, కరువు, శతృత్వం, కష్టకాలం, బీదరికాలను ప్రస్ఫుటించే చిత్రాలను తొలగించండి. భోజనశాల అలంకారణ, గృహములో హాలు తర్వాత ప్రధమంగా ఆకర్షించే గది భోజనశాల. ఈ గదిలోని డైనింగ్ టేబుల్ని ఎప్పుడూ చక్కటి అద్దంతో ఉండాలి.
ఈ గదిలోని అద్దాలు మన సంపదని రెట్టింపు చేస్తుందని ఫెంగ్‌షుయ్ పేర్కొంటుంది. ఉత్తరం వైపు అద్దం వచ్చేటట్లుగా గదిని అలంకరించుకోండి. భోజనగదిలో పండ్లు, కాయగూరలు ఉన్న పెద్ద పోస్టర్నో అతికించవచ్చు. అలాగే డైనింగ్ టేబుల్ మీద పండ్లతో కూడిన ఒక పళ్ళెంన్ని ఉంచినచో అది గృహంలో ఆహారం కొరత ఉండదు. ఫ్రిజ్‌లో ఎప్పుడు ఆహారపదార్థాలు నిండుగా ఉండేటట్లుగా చర్యలు తీసుకోండి.