మన ఇల్లు ఎప్పుడూ దీర్ఘచతురస్రాకారంగా, చదరంగా ఉండాలని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. ఇంటి నిర్మాణంలో ఎక్కువ, తక్కువగా ఉంటే కొన్ని శుభ, అశుభ ఫలితాలు చేకూరుతాయని వారు చెబుతున్నారు.
ఇందులో భాగంగా.. తూర్పు దిక్కు పెరిగితే ఇంట్లో పెద్ద సంతానానికి అన్ని విధాలా మంచి జరుగుతుంది. చక్కటి వ్యాపార పెరుగుదల, వృద్ధి వంటివి చేకూరుతాయి. ఒకవేళ తూర్పు దిక్కు తగ్గితే మాత్రం పైన చెప్పిన వాటికి వ్యతిరేక ఫలితాలు కలుగుతాయని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది.
అలాగే పడమర దిక్కు పెరిగినపుడు:
కుటుంబంలో చివరి సంతానం వల్ల సంపద, ఆనందం లభిస్తుంది. కుటుంబం మొత్తం ఆర్థికంగా వృద్ధి చెందుతుంది. అదే పడమర దిక్కు తగ్గినప్పుడు మాత్రం ఖర్చులు అధికం.
ఉత్తరం పెరిగితే..: దొంగల భయం ఉండదు. కుమారులు కుటుంబానికి సహాయంగా ఉంటారు. అదే ఉత్తరం తగ్గితే ఇల్లు దొంగతనాలు, కొడుకులు జులాయిగా తిరగడం, యాక్సిడెంట్లు వంటివి సంభవించే అవకాశం ఉందని ఫెంగ్‌షుయ్ శాస్త్రం అంటోంది.
ఇక దక్షిణం పెరిగితే..: ఆ కుటుంబంలోని ఆడకూతుళ్లు విద్యలో ఆరితేరడంతో గౌరవం, కీర్తి ప్రతిష్టలు చేరువవుతాయి. అయితే దక్షిణం దిక్కు తగ్గినప్పుడు ఆ కుటుంబం అమర్యాద పరిస్థితుల్లో ఉంటుంది. ఇంకా ఆ కుటుంబంలో పుట్టిన కుమార్తెలు చంచల స్వభావం కలిగి ఉంటారని ఫెంగ్‌షుయ్ నిపుణులు చెబుతున్నారు.